Firefighters Week: ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

0
148

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ దాకా నిర్వహించిన అగ్ని మాపక వారోత్సవాలు శనివారంతో ముగిసినట్లు సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరసింహచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏప్రిల్ 14, 1944 సంవత్సరంలో విక్టోరియా డాక్ యార్డ్ లో ఒక నౌకలో అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో మరణించిన 66 మంది అగ్ని మాపక సిబ్బంది స్మారకార్థం వారికి ఈ నెల 14వ తేదీన నివాళులు అర్పించామని పేర్కొన్నారు.

తమ శాఖ రూపొందించిన పోస్టర్లు, పాంప్లెట్స్, స్టికర్స్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదయంలోని తన ఛాంబర్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారని గుర్తు చేశారు.

15వ తేదీన జనాల రద్దీ ఎక్కువగా ఉండే సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న విగ్రహం వద్ద, అంబేద్కర్ చౌక్, కొత్త బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై డెమో నిర్వహించామని తెలిపారు.

ఈ నెల 16న జిల్లా లోని అపార్ట్మెంట్స్ లో సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు, మంటలు అంటుకుంటే ఆర్పే విధానంపై తెలియజేశామని పేర్కొన్నారు.

ఈ నెల 17న హాస్పిటల్‌లో, 18 న పరిశ్రమలు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, సిలిండర్ల గోడౌన్ ల వద్ద అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై వివరించినట్లు చెప్పారు.

19న దుకాణాల వద్ద అవగాహన కల్పించామని తెలిపారు. మంటలు ఆర్పివేసే పరికరాల వినియోగంపై ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి వివరించాలని, అవగాహన అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here