కట్టుకున్న భార్య నిత్యం కర్రోడా అని హేళన చేయడంతో ఓ భర్త భార్యకు విడాకులిచ్చిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. భార్య పదేపదే అలా పిలవడంతో తనకు విడాకులు ఇప్పించాలంటూ ఆ భర్త ఏకంగా కోర్టు మెట్లెక్కాడు.
భార్య ప్రతిసారి అలా పిలవడంతో ఇబ్బందిగా ఉందని కోర్టులో వాపోయాడు. హిందూ వివాహ చట్ట ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు వెల్లడించింది.
ఇలా పిలవడంతో మెంటల్, ఫిజికల్, ఎమోషనల్‌గా కూడా మనస్తాపం చెందాడని తెలిపింది. అంతేకాకుండా భర్త విజ్ఞప్తి మేరకు కోర్టు విడాకులను సైతం మంజూరు చేసింది.