ప్రతి ఏడాది మృగశిర కార్తె నాడు ఇచ్చే చేప ప్రసాదం ఈ ఏడాది ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రసాదం పంపిణీదారు బత్తిన కుటుంబం కీలక ప్రకటన చేసింది.
చేప ప్రసాదం తింటే అస్తమా తగ్గుతుందని వేలాది మంది ప్రజలు నమ్ముతారు. దీనికోసం ఎదురుచూసే వారి సంఖ్య వేలల్లో ఉండడం విశేషం.
సమయం దగ్గర పడడంతో ఇప్పటికే చేప ప్రసాదం తయారీ ప్రకియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశించడంతో ఆరోజునే చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్ గౌడ్‌లు వెల్లడించారు.
జూన్ 8న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే చేప ప్రసాదం పంపిణీ ముందు రోజు నిర్వాహకులు సత్యనారాయణ స్వామి వ్రతం, బావిపూజ చేస్తారు.