brs: దానంపై అనర్హత వేటు వేయండి

0
40

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు


కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం సోమవారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఆయన నివాసంలో కలిసి పిటిషన్‌ సమర్పించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం మూడు నెలల్లో తీసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని ఈ సందర్భంగా వారు స్పీకర్‌కు గుర్తుచేశారు.

అనంతరం హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దానం అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరగా, స్పీకర్‌ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, పార్టీలు మారిన వారిని బండరాళ్లతో కొట్టాలన్న మాటలను ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.

‘రేవంత్‌ మాపై దెబ్బకొట్టారు.. మేం తీసుకున్నాం.. మేం కొట్టే దెబ్బ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. మేం గేట్లు తెరిస్తే మీరు భూస్థాపితమవుతారు జాగ్రత్త’ అని వ్యాఖ్యానించారు.

ఇదే విషయమై బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ స్పందించారు. దానం పార్టీ మారడం నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here