brs party: బీఆర్‌ఎస్‌లోకి ఆర్‌ఎస్పీ

0
28

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో చేరిక

బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు.

రెండు రోజుల క్రితమే బీఎస్పీ రాజీనామా చేసిన ఆయన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌ అధికారిగా అందరికీ సుపరిచతమే. బీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన బీఎస్పీ చీఫ్‌ మాయవతి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కొద్దిరోజుల క్రితమే బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామంటూ ప్రకటన చేసిన ఆయన ఏకంగా పార్టీకే రాజీనామా చేసి పలువురు బీఎస్పీ నేతలతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు.

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రవీణ్‌ కుమార్‌ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here