- హస్తం గూటికి బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట మండలం వెంకట్రావుపేట బీఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షుడు మంతెన మల్లేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మంతెన పెద్ద మల్లేశం, వీడీసీ చైర్మన్ రామస్వామి, రాజేశం, శంకర్ రవీందర్,
దేవయ్యలు బుధవారం వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌తోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
పెద్దమ్మ, పెద్దిరాజుల కల్యాణ మహోత్సవంలో..
కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం జరిగిన పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు విప్ చెప్పారు.
నూతన రైస్ మిల్ ప్రారంభం
కథలాపూర్ మండలం దూలురు గ్రామంలో నూతనంగా నిర్మించిన మురళీకృష్ణ రైస్ మిల్‌ను బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావుతో కలిసి ప్రారంభించారు.
వినియోగదారులు, రైతులకు మెరుగైన సేవలు అందించాలని యాజమాన్యానికి ఈ సందర్భంగా సూచించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన జంకె రామ లచ్చవ్వ కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.