eatela rajendar: మోడీ గ్యారంటీ, ఈటల ష్యురిటీ

0
44
  • బీజేపీ మల్కాజ్‌గిరి మేనిఫెస్టో విడుదల
  • హైదరాబాద్‌ వచ్చిన పేదలకు సొంతింటి కల నెరవేర్చుతా
  • బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

వికసిత మల్కాజ్‌గిరి, స్వచ్ఛ మల్కాజ్‌గిరి, స్కిల్డ్ మల్కాజ్‌గిరి, ఆరోగ్య- ఆయుష్మాన్ మల్కాజ్‌గిరి, ఆత్మ నిర్భర నారీశక్తి మల్కాజ్‌గిరి, డిజిటల్ మల్కాజ్‌గిరి, మేక్ ఇన్ మల్కాజ్‌గిరి ఏడు అంశాలతో

మోడీ గ్యారంటీ, ఈటల ష్యురిటీ పేరుతో బీజేపీ మల్కాజ్‌గిరి మేనిఫెస్టోను బుధవారం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ జన్మదినం సందర్భంగా శామీర్ పేట నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రంలో మేనిఫెస్టో, క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు.

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచార వివరాలు, బీజేపీ పథకాలను ఇందులో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ వేలాదిగా తరలివచ్చి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

మే 13న దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల శంఖారావాన్ని మల్కాజిగిరిలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందన్నారు.

యావత్ తెలంగాణ ప్రధాని ఆలోచనతో 370 సీట్లకు పైగా బీజేపీ సొంతంగా గెలవాలనే నినాదన్ని నిజం చేయాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగం బిగ్గెస్ట్ ఛాలెంజ్


‘తెలంగాణ ఉద్యమకారుడిగా నా చరిత్ర మీ కళ్ల ముందు కదలాడుతుంది. ఏ అకుంఠిత దీక్ష కోసమైతే పోరాడేమో అదంతా మీ కళ్ల ముందు ఉంది.

తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా సమయంలో పనిచేసినదంతా మీరు చూశారు. మల్కాజ్‌గిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందుకి వచ్చాను.

నిరుద్యోగమే ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్. భారత ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదంతో ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తా’నని ఈటల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో పేదవారికి స్థలం కొనే భాగ్యం లేకుండా పోయిందని, సొంతింటి కల కలగానే మిగిలిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 37 వేల ఇల్లు మంజూరు చేసినా వాటిని నిర్మించి పేదలకు పంచడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన పేదలతో సహా ఇక్కడ ఉండేవారికి సొంతింటి కల నెరవేర్చడంలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

వైద్యాన్ని పేదలకు చేరువచేస్తా


వైద్యం మీద పెట్టే ఖర్చు అనుకోకుండా వచ్చి పడే పిడుగు లాంటిదన్నారు. పేదవారికి వైద్య అవసరాల కోసం డబ్బుల్లేక అప్పులు చేసి వైద్యం చేయించుకోవడం మనుషులను పోగొట్టుకోవడం జరుగుతుందన్నారు.

ఆయుష్మాన్ భారత్, ఎయిమ్స్ తో పాటు అన్ని రకాల వైద్య సౌకర్యాలను పేదలకు మరింత చేరువ చేస్తానన్నారు.

స్థానికంగా డ్రైనేజ్, రోడ్లు, ట్రాన్స్‌పోర్ట్‌ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కేంద్రంలో మోడీ సర్కారు ఉంది కాబట్టి దరఖాస్తు పెట్టి దండం పెట్టే అవసరం లేకుండా మీ బిడ్డగా వాటిని పరిష్కారం చేస్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here