ప్రజానావ/వేములవాడ: వేములవాడ అర్బన్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్‌ను శుక్రవారం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు రంగు సత్తమ్మ రాములు, రాసురి రాజేష్, కదిరే రాజ్ కుమార్, గుర్రం లక్ష్మారెడ్డి, ఇటిక్యాల నవీన రాజు, జింక శ్రీధర్‌లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్‌ను మర్యాదపూర్వంగా కలిసినట్లు చెప్పారు. అనంతరం సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.