తండ్రీ కొడుకులను కలిపిన న్యాయవాది పిల్లి మధు

0
18

తండ్రితో గొడవపడి, ఆగ్రహంతో ఇంటిని వదిలి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వచ్చాడు ఓ యువకుడు. పని కోసం తిరుగుతూ శనివారం పట్టణానికి చెందిన ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది పిల్లి మధు వద్దకు వచ్చాడు. తన పేరు రాహుల్‌ రాజ్‌ అని, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన వాడినని, డిగ్రీ వరకు చదువుకొని మెడికల్‌ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు చెప్పడంతో పాటు తాను ఇంటి నుంచి గొడవ పడి వచ్చిన విషయాన్ని కూడా వివరించాడు. దీంతో యువకుడి వద్ద వివరాలు తీసుకొని ఆశ్రయం కల్పించాడు. అనంతరం రాహుల్‌ తండ్రికి సమాచారం అందించాడు. వారు ఆదివారం వేములవాడకు చేరుకోగా, స్థానిక ముదిరాజ్‌ సంఘం భవనంలో రాహుల్‌ను తన తండ్రికి అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. అయితే ఫాదర్స్‌ డే రోజునే ఇలా తండ్రీకొడుకులను కలపడంపై న్యాయవాది పిల్లి మధును పలువురు అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here