Amit shah: కాంగ్రెస్‌ 40 సీట్లు కూడా దాటదు

0
80
  • సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు కూడా రావు
  • ఇవి రామభక్తులపై కాల్పులు జరిపిన వారికి, రామమందిరం కట్టినవారికి జరుగుతున్న ఎన్నికలు
  • ఎస్పీ, యూపీఏ ప్రభుత్వాలు యూపీలో రూ.12లక్షల కోట్ల కుంభకోణం చేశాయి
  • 25 ఏళ్లు రాజ్యాంగ పదవిలో ఉన్న మోడీపీ 25 పైసల అవినీతి ఆరోపణలు లేవు
  • కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

ఇప్పటివరకు జరిగిన ఐదు దశల్లో 310 సంఖ్యను మోడీ ఆరో దశ ఎన్నికల్లో 400 దాటించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు.

సోమవారం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈసారి కాంగ్రెస్‌ 40 సీట్లు కూడా దాటదని, అలాగే ఎస్పీకి నాలుగు సీట్లు కూడా రావని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సేలంపూర్‌ నియోజకవర్గం హల్దీరాంపూర్‌లో బీజేపీ అభ్యర్థి రవీంద్ర కుష్వాహకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలోనూ అమిత్‌షా ప్రసంగించారు.

ఈ ఎన్నికలను అమిత్‌షా రామభక్తులపై కాల్పులు జరిపిన వారికి, రామమందిరం కట్టినవారికి జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు.

యూపీలో ఎస్పీ, యూపీఏ ప్రభుత్వం రూ.12లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఇదే సమయంలో 25ఏళ్లు రాజ్యాంగ పదవిలో ఉన్న మోడీపై 25 పైసల అవినీతి ఆరోపణలు లేవని ప్రశంసించారు.

అన్నీ కుంభకోణాలే..
కాంగ్రెస్‌ పార్టీ సముద్రం నుంచి ఆకాశం వరకు మోసాలు చేసిందని, ప్రతిపక్షాలు ఈ దురంహకార కూటమిని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాయని విమర్శించారు.

ప్రతిపక్ష కూటమికి మెజార్జీ వస్తే ప్రధాని ఎవరో దేశమంతా తెలుసుకోవాలనుకుంటుందని ఎద్దేవా చేశారు. గతంలో ఎస్పీ హయాంలో రూ.6వేల కోట్ల పీఎఫ్‌, రూ.1500కోట్ల గోమతి రివర్‌ ఫ్రంట్‌, నోయిడా భూకేటాయింపులు, జల్‌ నిగమ్‌ కుంభకోణాలతో పాటు ల్యాప్‌టాప్‌ స్కామ్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాములు జరిగాయని ఈ సందర్భంగా అమిత్‌ షా గుర్తుచేశారు.

దేశంలోని 60కోట్ల పేదల జీవితాల్లో వెలుగులు నింపడం ప్రధాని మోడీతోనే సాధ్యమన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని, అణుబాంబులతో సమస్యలు పరిష్కారం కావన్నారు. నాయకుడి దృఢ సంకల్పంతో మాత్రమే సమస్య పరిష్కారమవుతుందని అమిత్‌ షా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here