cm revanth: సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటన అందుకేనా?

0
91

సీఎం రేవంత్‌ రెడ్డి నేటి రాత్రికి ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియాను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది.

దీనిపై ఏఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియాతో వ్యక్తిగతంగా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు, పంజాబ్‌ ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోనియాతో భేటి అయ్యే అవకాశం ఉంది.

సోనియాగాంధీతో పాటు రాహుల్‌, ప్రియాంకగాంధీలను పీసీసీ ఆహ్వానించింది. మరోవైపు జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకొని సోనియా హాజరవుతుందా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదిలాఉంటే సోనియాను ఆహ్వానించడం ద్వారా ప్రజల్లోకి స్పష్టమైన సందేశం వెళ్లడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here