Contonment: ఆస్పత్రికి వస్తే ప్రాణం పోయింది

0
593
  • కంటోన్మెంట్‌ ఆస్పత్రిలో దంపతులపై విరిగిపడిన భారీ చెట్టు
  • భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు

ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులు రవీందర్‌, సరళదేవిపై ఓ భారీ చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి.

ఈ ఘటన హైదరాబాద్‌లోని బొల్లారం కంటోన్మెంట్‌ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. దీంతో ఆస్పత్రికి వచ్చిన వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

తీవ్రంగా గాయపడిన సరళదేవిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా, రవీందర్‌ మృతదేహాన్ని సైతం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సరళదేవి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ఇదిలాఉంటే సరళ దంపతుల కంటే ముందే ఒక వాహనం అక్కడి నుంచి వెళ్లిందని, ఆ తర్వాత వీరు అటునుంచే ప్రయాణించే క్రమంలో చెట్టు విరిగి వీరిపై పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here