Ohio Sex worker: హెచ్‌ఐవీ ఉన్నా 200 మందితో..

0
278

అమెరికా ఓహియో రాష్ట్రానికి చెందిన లిండా లిక్సెస్‌ (30 ) అనే మహిళా సెక్స్ వర్కర్ తనకు హెచ్ఐవీ-పాజిటివ్ అని తెలిసినప్పటికీ, 200 మందితో సెక్స్‌ చేసింది.

2022లోనే తను హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. అయితే లిండా ఈ రెండేళ్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 211 మందితో లైంగికంగా కలిసింది.

ఓహియోలోని చిన్న నగరమైన మారియోట్టాలో ఆమె అధికంగా క్లయింట్లను కలిసి ఉందని, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిలో అధికంగా తూర్పు తీరంలో నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

లిండాతో లైంగికంగా సంబంధం ఉన్నవారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులంతా నిజాయితీగా ఉండాలని మెరియోట్టా, బెల్ఫ్రే ఆరోగ్య శాఖలు కోరాయి.

మరోవైపు లిండాను ఈ నెల 13న పోలీసులు అరెస్టు చేశారు. లిండా చేసింది మామూలు నేరం కాదని, ఇది ఒకరకంగా థర్డ్‌ డిగ్రీ నేరమని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here