- సిరిసిల్లలో కాంట్రాక్టర్ నుంచి రూ.8వేల లంచం డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్
- పక్కా ప్రణాళికతో పట్టుకున్న ఏసీబీ
లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానంటూ డిమాండ్ చేసిన లంచగొండి అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేశ్ రూ.4.50లక్షలతో వ్యయంతో స్మశాన వాటిక కాంపౌండ్ నిర్మించాడు.
వీటి బిల్లు కోసం నాలుగు నెలలుగా తిరుగుతున్నాడు. అయితే రూ.8వేలు లంచం ఇస్తే తప్ప బిల్లు మంజూరు చేయానంటూ పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కర్ తెగేసి చెప్పాడు.
దీంతో కాంట్రాక్టర్ వెంకటేశ్ రూ.7వేలు ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని వెంకటేశ్ విషయాన్ని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు తెలియజేశాడు.
వారి సూచనల మేరకు వెంకటేశ్ సీనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్‌కు రూ.7వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భాస్కర్‌రావును అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.