Mlc Kavitha: అయ్యో.. కవితక్క

0
468
  • రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే
  • జూన్ 3వరకు రిమాండ్‌ పొడిగింపు

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతరు ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది.

ఆదివారం కవిత జ్యుడిషియల్‌ రిమాండ్‌ ముగియడంతో అధికారులు కవితను వర్చువల్‌గా రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా, జూన్‌ 3వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మార్చి 15న అరెస్టయిన కవితకు ఇప్పటివరకు బెయిల్‌ లభించకపోవడంతోఉ తీహార్‌ జైలులో ఉన్నారు. ఇదే కేసులో తన తర్వాత అరెస్టయిన ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here