సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
తెలంగాణలో హనుమంతుడు లేని ఊరే ఉండదని, ప్రతి ఇంట్లో.. ప్రతి గుండెలో హన్మంతులు ఉంటారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ఈ ప్రాంత ప్రజలందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చి స్థానిక యువకులకు ఉపాధి కలిగిందని, స్థానిక ఎమ్మెల్యే యాదయ్య కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.
ఇక్కడ అభివృద్ధి చూస్తుంటే హైదరాబాద్ నగరంలో ఉన్నట్టే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, స్థానిక నాయకులతో పాటు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.