సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

0
21

-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
ప్రజానావ, సిరిసిల్ల:
సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సంతు సేవాలాల్ జయంత్యుత్సవాల్లో ఆది శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం సంతు సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు.

గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. గిరిజనులు సంత్ సేవాలాల్ ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు.

సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.

సంతు సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాన్ని స్వీకరించి వారి అడుగుజాడల్లో ముందుకు నడవాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం పక్షాన గిరిజనుల హక్కులను కాపాడుతామన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here