జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి

0
14

సిరిసిల్ల అదనపు ఎస్పీ చంద్రయ్య


ప్రజానావ, సిరిసిల్ల బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే రీతిలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రైనీ కానిస్టేబుళ్లకు అదనపు ఎస్పీ చంద్రయ్య సూచించారు.

పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకంలో భాగంగా స్టయిఫండరీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్లుగా ఎంపికై తొమ్మిది నెలల శిక్షణకు వెళ్లుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లతో అదనపు ఎస్పీ చంద్రయ్య జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సమావేశమై పలు సూచనలు చేశారు.

జిల్లా పరిధిలో నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామాకాల్లో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ లో కానిస్టేబుళ్లుగా ఎంపిక కాగా ఇందులో 79మంది పురుషుల్లో 31 మంది సివిల్‌ ట్రైనీ కానిస్టేబుళ్లు, 48మంది ఆర్మూడ్‌ రిజర్వ్‌ ట్రైనీ కానిస్టేబుళ్లు ఉన్నారు.

అలాగే 26 మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లలో 17 మంది సివిల్‌ ట్రైనీ, 09 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ట్రైనీ కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరందరికి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీతో పాటు, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో తొమ్మిది నెలల శిక్షణ అందజేయబడుతుందన్నారు.

ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌ అనిల్ కుమార్, సీఐ సదన్ కుమార్, ఆర్ఐ మాధుకర్, సీనియర్ అసిస్టెంట్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here