డబ్ల్యూపీఎల్ విజేతగా బెంగళూరు
ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన డబ్ల్యూపీఎల్ (wpl 2024) (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) ఫైనల్‌లో ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించి, తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (44), కెప్టెన్ లిన్నింగ్ (23) మినహా మిగతా బ్యాట్లరంతా విఫలమయ్యారు.
ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు పడగొట్టగా, మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆచితూచి ఆడి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
కెప్టెన్ స్మృతీ మంధాన (31), సోపీ డివైన్ (32), ఎల్లీసె పెర్రీ (35, నాటౌట్), రీచా ఘోష్ (17, నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మిన్ను మణిలకు చెరో వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సోపీ మోలినెక్స్ నిలిచింది.
గెలిచిన జట్టు రూ.20కోట్ల ప్రైజ్ మనీ (prize money) అందుకోనుండగా, రన్నరప్ జట్టుకు (runner up team) రూ.13కోట్లు దక్కనున్నాయి.