రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా?

0
11

– వారికి దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి
– ఐటీ మంత్రి కేటీఆర్
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజర్లపై రెజర్లపై ఢిల్లీ పోలీసుల తీరును తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లకు దేశ ప్రజలంతా మద్దతుగా నిలవాలని, వారికి మనమంతా గౌరవం ఇవ్వాలన్నారు. జంతర్‌మంతర్‌ ఆదివారం రణరంగమైన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రెజ్లర్ల పట్ల కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు కర్కశంగా ప్రవర్తించాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడానికి నిరసనగా ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనం వద్ద ‘మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌’ నిర్వహించ తలపెట్టారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు నిర్బంధించారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్‌ స్టేషన్లకు తరలించి, రెజ్లర్లపైనే కేసులు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here