నాసా పోటీల్లో హుస్నాబాద్ శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

0
16

– స్వర్గ్ ప్రాజెక్టుకి ప్రథమ బహుమతి
ప్రజానావ/హుస్నాబాద్‌: నాసా పోటీల్లో హుస్నాబాద్ శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు వై.వంశిక, జి.మైత్రి, ఏ.స్వాత్విక రెడ్డి, బి.భువన శ్రీ, ఏ.శశి ప్రియ మరియు ఏ.సింధుజ రెడ్డి బృందం తయారు చేసి పంపిన నాసా ప్రాజెక్టు నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో జాతీయస్థాయి లో ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ‘స్వర్గ్’ గా నామకరణం చేశారని, ఇలాంటి ప్రతిష్టాత్మక బహుమతి రావడం హుస్నాబాద్ పట్టణంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. నాసా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్‌లో ఇంతటి అద్భుతమైన విజయం సాధించడానికి కాన్సెప్టువల్ టీచింగ్ మెథడాలజీ, యాక్టివిటీ, ప్రాక్టికల్ బేస్డ్ టీచింగ్, రోట్ లెర్నింగ్ అనే పాత పద్ధతిని పక్కనబెట్టిందన్నారు. ఈ విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి, నాసా ఇన్‌చార్జి కృష్ణవేణి కి ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మణరావు, ఆర్ఐ రాజు, కోఆర్డినేటర్ మహాలక్ష్మి నాయుడు, విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ కృష్ణవేణి, డీన్ ఆంజనేయులు, ప్రైమరీ ఇన్‌చార్జి, ప్రీ ప్రైమరీ ఇన్‌చార్జి, ఏవో తిరుపతి, పీటీ రాజు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here