earthquake| 25ఏళ్ల తర్వాత మళ్లీ..

0
150
  • తైవాన్‌లో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతగా నమోదు
  • 9 మంది మృతి, 934 మందికి పైగా గాయాలు
  • 50 మంది ఆచూకీ గల్లంతు
  • జపాన్‌లో సునామీ, నలుగురు మృతి

తైపీ: తైవాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4 గాయూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకటించగా, తైవాన్ భూకంప పర్యవేక్షణ సంస్థ రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది.

ఉదయం 7.58 గంటలకు హువాలియన్ కు ఆగ్నేయంగా 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.

భూకంపంతో హువాలియన్ లోని ఐదంతస్తుల భవనం పాక్షికంగా మొదటి అంతస్తు కూలడంతో భవనం 45 డిగ్రీల కోణంలో వంగిపోయింది. కూలిన భవనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు తైవాన్ అంతటా రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో పాటు రాజధాని తైపీలో భవనాలపై నుంచి టైల్స్ పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా, దాదాపు 934మందికి పైగా గాయపడ్డారు.

మరో 50 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తైవాన్‌లో 25ఏళ్ల తర్వాత ఈస్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. 1999లో తైవాన్ లోని నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2,500 మందికి పైగా మృతి చెందగా, 1,300 మందికి పైగా గాయపడ్డారు.

యోనాగుని ద్వీపంలో సునామీ అలలు


తైవాన్‌ భూకంపం సంభవించిన 15 నిమిషాల తర్వాత జపాన్‌లోని యోనాగుని ద్వీపంలో సునామీ సంభవించి నలుగురు మృతి చెందారు.

ద్వీపంలో సుమారు 1 అడుగు సునామీ అలలను గుర్తించినట్లు జపాన్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) ఒకినావా ప్రావిన్స్ తీరప్రాంత వాసులను అలర్ట్‌ చేసింది. 3 మీటర్ల వరకు సునామీ అలలు దేశ నైరుతి తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

జేఎంఏ ప్రకారం.. 26 ఏళ్లలో ఒకినావాలో ఇది మొదటి సునామీ హెచ్చరిక. 1998లో ఇషిగాకి ద్వీపానికి దక్షిణాన 7.7 భూకంపం సంభవించిన తర్వాత ఇదే మొదటి భూకంపం.

కాగా, ఒకినావా, కగోషిమా ప్రాంతాల నుంచి వచ్చే అన్ని విమానాలను జపాన్ ఎయిర్ లైన్స్ దారి మళ్లించింది. ఇదిలాఉంటే అసోసియేషన్‌ ప్రెస్‌ నివేదించిన ప్రకారం నేషనల్‌ లెజిస్లేచర్‌, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నిర్మించబడిన పాఠశాల, గోడలు, పైకప్పులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here