కోదాడ మండలం పరిధిలోని గణపవరం గ్రామంలో ఘనంగా 2002 -2003 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. దీంతో పూర్వ విద్యార్థుల సందడితో గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఓకే చోట సుమారు ఇరవై ఏళ్ళ తరువాత కలుసుకోవడం విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.భర్తను కోల్పోయిన స్నేహితురాలి విషయం తెలుసుకున్న స్నేహితులు, కంటతడి పెట్టారు.అనంతరం ఆమెకు అండగా నిలిచి ఆర్థిక సహాయన్ని అందచేశారు.