మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులను ఎల్‌అండ్‌టీ ప్రారంభించింది. బ్యారేజీ వద్ద వానాకాలంలో చేపట్టిన చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు పనులను మొదలుపెట్టింది.
ప్రవాహానికి ఆటంకం కలిగించే రాళ్లు, ఇసుకమేటలను తొలగించడంతో పాటు ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా గేట్లను తెరవాలని ఎల్‌ఆండ్‌టీని నిపుణుల కమిటీ, ఇరిగేషన్ శాఖ ఆదేశించింది.
వారి ఆదేశాలతో మేడిగడ్డ బ్లాక్-7లోని ఎనిమిది గేట్లును ఎత్తివేసేందుకు పనులను ప్రారంభించారు. ఇప్పటికే ఇందులో ఒక గేటుని ఎత్తగా, మరో రెండు గేట్లు మినహా మిగిలిన వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశముంది.
ఇక పగుళ్లు ఏర్పడిన 20 పిల్లర్‌తో పాటు దాని పక్కనే ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తేక్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.