#Fear song: ఫియర్‌ సాంగ్‌ పిచ్చిలేపనుందా?

0
147

మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న కొత్త మూవీ దేవర. భారీ యాక్షన్‌ సీన్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానుల్లో ఇప్పటికే విపరీతమైన అంచనా పెంచింది.

ఈ సినిమా జూ.ఎన్టీఆర్‌కు జతగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ చేస్తుండగా, సైఫ్‌ అలీఖాన్ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగాణం ఉన్న ఈ సినిమా జూ.ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ట్రిపుల్‌ ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ టైగర్‌ను ఈ మూవీ మరో రేంజ్‌లో నిలబెడుతుందని టాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సినిమాకు సెన్సెషన్‌ అనిరుధ్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన మేకర్స్‌ గ్లింప్స్‌ వీడియో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది.

ఇదిలాఉంటే జూ.ఎన్టీఆర్‌ పుట్టినరోజు సోమవారం జరగనుండగా.. ఒక్కరోజు ముందుగానే మేకర్స్‌ ఈ చిత్రం నుంచి ‘ఫియర్ సాంగ్‌’ను రిలీజ్‌ చేస్తున్నట్లు ఎక్స్‌ ద్వారా ప్రకటించారు.

నేటి సాయంత్రం 7.02 గంటలకు మేకర్స్‌ ఈ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నారు. చిత్ర యూనిట్‌ సైతం ఈ పాటలోని ప్రతీ లైన్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుందని ట్వీట్‌ చేయడం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి రచించగా, హిందీలో మనోజ్‌ ముంతాషిర్‌, కన్నడలో ఆజాద్‌ వరదరాజ్‌, తమిళంలో విష్ణు ఏడవన్‌, మలయాళంలో గోపాలకృష్ణన్‌ రచించినట్లు చిత్రబృందం పేర్కొంది. మరోవైపు ఈ సాంగ్‌ కోసం జూ.ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here