పొలంలో నాట్లు వేసిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు, అధ్యాపక బృందం
వ్యవసాయంపై అవగాహన కోసం ‘రైతు యొక్క ప్రాముఖ్యత, వ్యవసాయమే ప్రధాన వనరుగా ఉన్న భారతదేశంలో రైతే దేశానికి వెన్నెముక’ నినాదంతో వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులను వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకెళ్లి వరి పొలాల్లో నాట్లు వేసి అవగాహన కల్పించారు. సస్య భారత్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ డీ సుదేష్ కుమారి మాట్లాడుతూ రైతు పండించే ప్రతి పంట చాలా విలువైనదని, అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆరుగాలం కష్టించే రైతు శ్రమని గుర్తించి వారిని గౌరవించాలని, ఆహారం వృథా చేయొద్దని విద్యార్థులకు సూచించారు. అనంతరం రైతులని సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లం పాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మణరావు, రీజినల్ ఇన్‌చార్జి ముద్రకోల రాజు, డీన్ శేఖర్, ఏఓ సుదీర్, పీఈటీ సుధాకర్ తో పాటు అధ్యాపక బృందం పాల్గొంది.