Do Not Share Bank details: ఎవరికీ బ్యాంకు వివరాలు, ఓటీపీ చెప్పొద్దు

0
80

సిరిసిల్ల ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని సిరిసిల్ల ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ జిల్లా ప్రజలకు సూచించారు.

ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని, ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలన్నారు. ఈ సందర్భంగా వారం రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా జరిగిన కొన్ని సైబర్‌ నేరాలను వివరించారు.

సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టైలరింగ్ చేస్తూ ఉన్న ఒక బాధితునికి ఆర్మీ నుంచి ఆఫీసర్స్ మాట్లాడుతున్నామని చెప్పి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయాలని, అమౌంట్ సెండ్ చేస్తాము అని చెప్పి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వాళ్లు అమౌంట్ పంపుతున్నట్టుగా నమ్మించారన్నారు.

పిన్‌ ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ వస్తాయని చెప్పగా బాధితుడు పిన్ ఎంటర్ చేయగా రూ.25వేలు నష్టపోయారని వివరించారు.

అలాగే వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్విక్ యాప్ అని లోన్ యాప్ ద్వారా రూ.3వేల లోన్ తీసుకోని దానిని చెల్లించినా ఇంకా డబ్బులు పంపించాలని, లేదంటే తన మార్ఫ్‌డ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో వాళ్ల కాంటాక్ట్స్ కి పంపిస్తామని బెదిరింపులకు పాల్పడగా బాధితులు రూ.15వేలు పంపించడం జరిగిందన్నారు.

ఇంకా అమౌంట్ పంపించమని అడగ్గా, అనుమానం వచ్చి బాధితులు సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేశారని చెప్పారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి తెలియకుండా ఏదో ఒక ఫ్రాడ్ లింక్ క్లిక్ చేయడం వలన అతని ఫోన్‌లో ఒక ఏపీకే ఇన్స్టాల్ కావడం జరిగింది.

తర్వాత తన ఫోన్ హ్యాక్ అయి తనకు తెలియకుండానే రూ.50వేలు నష్టపోయారని పేర్కొన్నారు. లోన్ యాప్ లకు దూరంగా ఉండాలని, కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దన్నారు.

ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలని ఎస్పీ సూచించారు.

లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దని, సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here