కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి కోట్లాది మందిని పొట్టనపెట్టుకుంది. కొత్త కొత్త వేరియంట్లతో పురుడు పోసుకుంటున్న ఈ వైరస్ అలజడి మళ్లీ మొదలైంది.
తాజాగా సింగపూర్‌లో కొవిడ్ భారీన పడిన వారి సంఖ్యల దాదాపు 30వేలకు చేరింది. గత వారం 13వేలలోపు ఉన్న కేసులు ఒక్క వారంలోనే ఈ స్థాయికి పెరగడంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మరోవైపు రానున్న రెండు, మూడు నెలల్లో ఈ వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఇప్పటివరకైతే ఎలాంటి ఆంక్షలను ప్రభుత్వం పెట్టలేదన్నారు.