ఎన్నికల వేళ పార్టీ మారుతున్న నాయకులు
రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోశమ్మ కొట్టిందట. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చకొని హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం అదే గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీలోని కీలక నేతలతో పాటు గతంలో కాంగ్రెస్ ఉన్న నాయకులంతా తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరికలకు సంబంధించి గేట్లు తెరవడంతో బీఆర్‌ఎస్ నేతలంతా క్యూ కడుతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఇంతకుముందే వీరిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. వీ
రితో పాటు జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, ఆయన సతీమణి కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో పాటు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొ.బానోతు రమణ నాయక్‌లు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి హస్తం గూటికి చేరారు. వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.