ప్రపంచాన్నే ఆకర్షించేలా కొండగట్టు

0
38
  • 800 ఎకరాల్లో కొండగట్టు ఆలయ అభివృద్ధి, 86 ఎకరాల్లో పార్కింగ్‌
  • త్వరలో ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్షిస్తా
  • బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌
    ‘దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలి. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటనలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా సీఎం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అని, భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలన్నారు. సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని, పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలన్నారు. 86 ఎకరాల్లో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలోనే మళ్లీ వస్తానని ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తానని ఈ సందర్భంగా కేసీఆర్‌ తెలిపారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కి బయల్దేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here