- సుప్రీం కోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు
- మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ను రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు ఈ తీర్పుతో చుక్కెదురైనట్లయింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని స్పష్టం చేసింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని కూడా సూచించింది. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించడంపై ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొనగా, దవే సూచనలను అంగీకరించిన సుప్రీం హెచ్‌సీఏ కమిటీ రద్దుకే మొగ్గుచూపింది.