తెలంగాణ అధికార చిహ్నంలో ఇక కాకతీయ తోరణం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుందన్నారు. సమ్మక్కసారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దంపట్టేలా, పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఇక జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీకే రూపకల్పన బాధ్యతలు ఇచ్చామన్నారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని, ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందేశ్రీ నిర్ణయానికే వదిలేసినట్లు చెప్పారు.
అయితే అందెశ్రీయే కీరవాణిని ఎంపిక చేశారని, సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్రలేదని రేవంత్ రెడ్డి పునరుద్ఘటించారు.