యాదాద్రికి కొండపై బారులుతీరిన భక్తులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు.
దీంతో ఉదయం నుంచే కొండ ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. క్యూ లైన్ ద్వారా (ఉచిత దర్శనం) దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది.
ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు సమయం పట్టినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక కొండపైన వాహన పార్కింగ్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఒక్కో వాహనం కదిలేందుకు చాలా సమయం పట్టడంతో భక్తులు సైతం అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు.
స్వామివారి దర్శనంతో పాటు అర్జిత సేవలు ఇకపై ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (tirumala tirupati devasthanams) భక్తుల కోసం తీసుకొచ్చిన సౌకర్యాలన్నీ యాదాద్రిలోనూ తీసుకొస్తామని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ సేవల కోసం https://yadadritemple.telangana.gov.in. వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని భక్తులకు సూచించారు. ఇదే వెబ్‌సైట్ నుంచి హుండీకి విరాళాలు సైతం అందించవచ్చని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలను బుక్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు.