- 6 హోల్‌సేల్ మెడికల్ షాపులపై కేసు
- రూ.51 లక్షల విలువైన ఇంజెక్షన్ల స్టాక్ సీజ్
డ్రగ్ కంట్రోల్ అధికారులు బుధవారం హైదరాబాద్ వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకొచ్చి హైదరాబాద్ లో 40శాతం డిస్కౌంట్లో ఇంజక్షన్లను విక్రమయిస్తున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో ఆరు హోల్‌సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి, రూ.51 లక్షల విలువైన ఇంజెక్షన్ల స్టాక్‌ను సీజ్ చేశారు.
ఇందులో సికింద్రాబాద్‌లోని దుర్గా హబ్ మెడికల్ షాప్‌లో రూ.6.7 లక్షల స్టాక్, ఉప్పల్ శ్రీ తిరుమల ఫార్మా మెడికల్ షాప్‌లో రూ.3.52 లక్షల స్టాక్, సుల్తాన్ బజార్ శ్రీ పరస్ మెడికల్ ఏజెన్సీస్‌లో రూ.9 లక్షల స్టాక్,
నాగోల్ శ్రీ గణేశ్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌లో రూ.14 లక్షల స్టాక్, కాప్రా శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్‌లో రూ.2 .7 లక్షల స్టాక్, కాచిగూడ శ్రీ బాలాజీ ఏజెన్సీస్ లో రూ.16 లక్షల స్టాక్‌ను సీజ్ చేశారు. ఈ మెడికల్ షాప్ ల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు.