తొలిరోజు ఆసీస్‌దే ఆధిపత్యం

0
57
  • తేలిపోయిన టీమిండియా బౌలర్లు
  • డబ్ల్యూటీసీ ఫైనల్‌
    ఓవల్‌ వేదికగా భారత్‌, ఆసీస్‌ మధ్య బుధవారం నుంచి ప్రారంభమైన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. తొలి సెషన్‌ నుంచి నిలకడగా ఆడిన కంగారూలు తొలి రోజే 300 మార్క్‌ దాటి భారీ స్కోరుపై కన్నేసింది. ట్రావిస్‌ హెడ్‌ (146 పరుగులు బ్యాటింగ్‌), స్టీవ్‌ స్మిత్‌(95 పరుగులు బ్యాటింగ్‌) భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ఇద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. తొలి సెషన్‌లో రెండు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు.. మలి రెండు సెషన్లు కలిపి కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టడం విశేషం. ఇక రోజంతా కలిపి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసిన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆస్ట్రేలియాకు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇచ్చిన మంచి ఆరంభాన్ని ట్రావిస్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌ కొనసాగించారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా హెడ్‌ వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మరోవైపు తనదైన బ్యాటింగ్‌తో స్టీవ్‌ స్మిత్‌ 95 పరుగులతో క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీకి మరో 5 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ, సిరాజ్‌, శార్దుల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here