పురుషులు, మహిళలు సమానమే

0
22

– రెండు మస్కట్లను విడుదల చేసిన ఐసీసీ
న్యూఢిల్లీ: క్రికెట్‌లో పురుషులు, మహిళలు సమానమే అనే ఉద్దేశ్యంతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఎరుపు, నీలి రంగుల రెండు రకాల ప్రపంచకప్‌ మస్కట్‌లను విడుదల చేసింది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతలు యశ్‌ధూల్‌, షఫాలీ వర్మ సమక్షంలో వీటిని ఆవిష్కరించింది. ఇందులో పురుషుల మస్కట్‌ నీలి రంగు పోలి ఉండగా, మహిళల మస్కట్‌ ఎరుపు రంగులో ఉంది. ఈ సందర్భంగా ఐసీసీ ఈవెంట్స్‌ క్రిస్‌ టెట్లీ మాట్లాడుతూ మహిళల మస్కట్‌ ద్వారా ఈలోకంలో సమానత్వం, వైవిధ్యాన్ని చాటుతున్నామని, ఇందులో చూపించిన క్యారెక్టర్లు క్రికెట్‌కు ఉన్న ఆదరణను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. అక్టోబర్‌ 5న ఇంగ్లాండ్‌-న్యూజిల్యాండ్‌ మ్యాచ్‌తో ప్రపంచకప్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈసారి భారత్‌ ఆతిథ్యం ఇవ్వడంతో క్రికెట్‌ ప్రేమికులు ప్రపంచకప్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here