– జపాన్ క్రీడాకారిణిని మట్టికరిపించిన నీతూ ఘంగాస్
– మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు) భారత్‌కు పతకం ఖరారు చేసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో జపాన్‌కు క్రీడాకారిణి మడోకా వాడాకు మట్టికరిపించిన నీతూ సెమీస్‌కు అర్హత సాధించి భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. తొలి రౌండ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించడంతో రెండో రౌండ్‌లో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆర్‌ఎస్‌సీ (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్) ద్వారా నీతూను విజేతగా ప్రకటించాడు. ఈ పోటీల్లో నీతూ ఆర్‌ఎస్‌సీ ద్వారానే మూడు బౌట్‌లలో విజయం సాధించడం విశేషం. మరోవైపు, ఇవాళ జరుగబోయే బౌట్‌లలో మరో ఏడుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరి (52 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జైస్మిన్ లంబోరియా (60 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) (+81 కేజీలు) (+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు.