విండీస్‌ను ‘తిప్పేశారు’

0
14

– కరేబియన్లకు చుక్కలు చూపించిన కుల్దీప్‌, జడేజా
– వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్‌ 5 వికెట్ల విజయం
బార్బడాస్‌: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అర్ధ సెంచరీతో రాణించాడు. అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా దెబ్బకు 23 ఓవర్ల 114 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (43), అలిక్‌ అథనాజే (22) తప్ప మరెవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 3, హార్దిక్‌ పాండ్యా, ముఖేశ్‌ కుమార్‌, శార్దుల్‌ ఠాకూర్‌లు ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 22.5 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (52) అర్ధ సెంచరీ సాధించాడు. నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 29న జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here