భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..

0
17

– 9 మ్యాచ్‌లు రీ షెడ్యూల్‌ చేసిన ఐసీసీ
వన్డే ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా తొమ్మిది మ్యాచ్‌లను ఐసీసీ (ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌0 రీషెడ్యూల్‌ చేసింది. మొత్తం 9 మ్యాచ్‌ల తేదీలను మార్చినట్టు అధికారికంగా ప్రకటన చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 15న భారత్‌లో నవరాత్రోత్సవాలు జరుగుతుండడంతో భద్రతా పరంగా పాకిస్తాన్‌ మ్యాచ్‌ను ఒకరోజు ముందుకు జరపాలని ఇప్పటికే ఐసిసికి వినతి చేసుకున్న విషయం తెలిసిందే. చాలారోజుల క్రితమే ఈ విజ్ఞప్తి పెట్టుకున్న ఎలాంటి ప్రకటన చేయని ఐసీసీ.. మొత్తం 9 మ్యాచ్‌లపై నిర్ణయం తీసుకుంది. కాగా అక్టోబర్‌ 15న జరగాల్సిన మ్యాచ్‌ను అదే వేదికగా భారత్‌, పాక్‌లు ఒకరోజు ముందు అంటే 14వ తేదీన ఆడనున్నాయి. అలాగే భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ట మధ్య జరిగే రెండు మ్యాచ్‌లు సైతం రీ షెడ్యూల్‌ కాగా, నెదర్లాండ్స్‌తో ఒక మ్యాచ్‌ కూడా రీ షెడ్యూల్‌ అయింది. అయితే తొమ్మది రీ షెడ్యూల్‌ అయిన మ్యాచుల్లో పాకిస్తాన్‌ జట్టు మ్యాచులే మూడు రీ షెడ్యూల్‌ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here