బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు

0
4

– కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ అన్నారు. అడ్డగుట్ట బీ సెక్షన్ లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో అడ్డగుట్టను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లుతున్నామని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు నక్క మధు, సత్తయ్య గౌడ్, వసంత, మహమ్మద్, నరేశ్‌, మల్లేశ్‌, శివ శంకర్, రామస్వామి, బస్తీవాసులు హరి, వీరేశ్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here