– టెస్టుల్లో 28వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ
ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత రన్ మిషన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. 241 బంతుల్లో 5 ఫోర్లతో శతకం పూర్తిచేశాడు. టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీకి ఇది 28వ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 75వ సెంచరీ. ఓవర్ నైట్ స్కోర్ 289/3 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది. 84 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్ తో 28 పరుగులు చేసిన జడేజాను టాడ్ మర్ఫీ బౌలింగ్ లో షాట్ ఆడేందుకు ట్రై చేసి ఉస్మాన్ ఖవాజాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అయితే శ్రీకర్ భరత్ తో కలిసి ఐదో వికెట్ కి 182 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన శ్రీకర్ భరత్, కామెరూన్ వేసిన ఓవర్ లోరెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 21 పరుగులు రాబట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఒక ఓవర్ లో ఇదే అత్యధిక స్కోర్. విరాట్ కోహ్లీ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు శ్రీకర్ భరత్ అవుట్ అయ్యాడు. 88 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, కేరీర్ బెస్ట్ స్కోర్ నమోదు చేసి నాథన్ లియాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఆసీస్‌పై 16వ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రన్ మిషన్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. దాదాపు టెస్టుల్లో 41 ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ నుంచి వచ్చింది. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఓవరాల్ కంగారూలపై కోహ్లీకి ఇది 16వ సెంచరీ కావడం విశేషం. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్లలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉన్నాడు. సచిన్ ఆసీస్‌పై 20 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లలో సచిన్ ఆస్ట్రేలియాపై 20 సెంచరీలు చేశాడు. బ్రాడ్‌మన్ ఇంగ్లాండ్‌పై (19), సచిన్ శ్రీలంకపై (17), కోహ్లీ ఆస్ట్రేలియాపై (16), శ్రీలంక జట్టుపై (16) సెంచరీలు చేశారు. ఇక అత్యధిక బంతుల్లో (స్లో) సెంచరీ సాధించడం కోహ్లీకి ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో 241 బంతుల్లో సెంచరీ చేశాడు. 2012లో నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 289 పరుగుల్లో సెంచరీ సాధించాడు.