వీడివల్లే వందే భారత్‌లో పొగలు

0
52

vande bharat express: తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బుధవారం ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఆందోళన చెందారు. దీంతో రైలును నెల్లూరు జిల్లా మనుబోలు స్టేషన్‌లో అరగంటకు పైగా నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులందరినీ దింపివేయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అసలు విషయం ఏంటని అధికారులు ఆరా తీయగా మూడో బోగిలో నుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే అధికారులు మూడో బోగి బాత్రూం వద్దకు వెళ్లి చూడగా తాగి పడేసిన సిగరేట్‌ ముక్క కనిపించింది. అది ప్లాస్టిక్‌ సామగ్రికి వ్యాపించడంతోనే పొగలు వచ్చినట్లు తేల్చారు. ఇదిలాఉంటే సిగరేట్‌ తాగిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తి టికెట్‌ లేకుండానే రైలు ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ప్రయాణికులతో రైలు అక్కడి నుంచి వెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here