వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

0
11

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన సోమవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌ నుంచి ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ టెర్మినల్‌కు వెళ్తున్న ఈ రైలు మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేతోరా స్టేషన్‌ దాటగానే రైలులోని బ్యాటరీ బాక్స్‌లో పొగలు వచ్చాయి. అనంతరం మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తరుచూ ప్రమాదాలకు గురికావడం సర్వసాధారణంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here