రాహుల్‌ మహిళా పక్షపాతి

0
10

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు


(rahul gandhi) భారత్ న్యాయ జోడో యాత్ర లో భాగంగా మహిళకు 5 గ్యారంటీలను (congress party) కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్ గాంధీ ప్రకటించారని, రాహుల్‌ మహిళా పక్షపాతి అని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు పేర్కొన్నారు.

శుక్రవారం ఆమె మాట్లాడుతూ నారి న్యాయ కింద మహిళలకు రూ.లక్ష ఇవ్వడంతో పాటు మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన రాహుల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి పంచాయతీలో మహిళల హక్కుల కోసం మైత్రి కమిటీ వేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతి జిల్లాలో హాస్టల్ ఉండాలని కోరుకున్నారన్నారు.

తెలంగాణలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని, 6గ్యారంటీల్లో భాగంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్‌తో పాటు ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

బీజేపీ (bjp) ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, బీఆర్ఎస్ (brs party) పార్టీకి చిత్త శుద్ధి లేదని విమర్శించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఇంటికి పంపిస్తారని, కేంద్రంలో ఈసారి వచ్చేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు.

మోడీ ప్రభుత్వం ఉన్న వాళ్లకు పెద్ద పీట వేసి లేని వాళ్లను అనగదొక్కిందన్నారు. బీజేపీ 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతుందని స్పష్టం చేశారు.

బీజేపీ మహిళల పట్ల చూపిస్తున్న వివక్షతను ప్రతి మహిళ ఆలోచించాలని, మన, మన పిల్లల భవిషత్తు బాగుండాలంటే దేశంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here