Rave party: ఆ రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ నటీమణులు ఎవరు?

0
239

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఆదివారం సాయంత్రం జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్‌ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ సోమవారం ఉదయం వరకు జరిగినట్లు తెలుస్తోంది.

పార్టీలో పెద్దమొత్తంలో డ్రగ్స్‌, కొకైన్‌ వాడకం జరిగింది. ఇక్కడ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

రేవ్‌ పార్టీ జరిగిన జీఆర్‌ ఫామ్‌ హౌస్‌ హైదరాబాద్‌కు చెందిన గోపాల్‌ రెడ్డిదిగా పోలీసుల విచారణలో తేలింది. పార్టీలో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్‌, భారీ ఎత్తున డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా పార్టీలో పట్టుబడగా, ఇందులో 25మంది యువతులు ఉన్నారు. నిర్వాహకులు వీరందని ఆంధ్రా నుంచి విమానంలో రప్పించినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ రేవ్‌ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీమణులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే కారుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేయగా, విచారణలో అన్ని నిజాలు బయటపడతాయన్నారు.

మరోవైపు ఓ తెలుగు నటి కూడా తనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిపై ఎలక్ట్రానిక్‌ ప్రాంత పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here