గంటలోపే టికెట్లు ఖతం

0
15

– హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టికెట్లు
ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌కు టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఈ సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్‌ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా భారత్‌- పాక్‌ జట్టు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయాలను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రారంభించిన గంటలోపే హాట్‌ కేకుల్లా అమ్ముడు పోయినట్లు తెలిపింది. 35వేల టికెట్లను అందుబాటులో ఉంచగా, టికెట్ల కోసం అభిమానులు పోటీపడి మరీ కొనుగోలు చేశారు. ఇదిలాఉంటే ఈసారి ఆసియా కప్‌కు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా, భారత్‌ మాత్రం అక్కడ ఆడేది లేదంటూ తెగేసి చెప్పడంతో చేసేదేమీలేక ఇరుజట్ల మ్యాచ్‌ను శ్రీలంక వేదికగా నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో భారత్‌ అన్ని మ్యాచ్‌లను ఇక్కడే ఆడనుంది. ఈ టోర్నీ మొత్తంలో 13 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, పాకిస్తాన్‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇదిలాఉంటే దాయాదుల పోరుకు మ్యాచ్‌ టికెట్ల ధరలు సాధారణ మ్యాచ్‌ల కంటే అధికంగాఉండడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు భారత్-పాక్‌ మ్యాచ్‌ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనంటూ చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here