వారందరికీ ఈ పుస్తకమే సమాధానం

0
5

– ‘తెలంగాణ ప్రగతి పథం’ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌
ప్రజానావ/హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మన పాలనా సామర్థ్యంపై విమర్శలు ఎక్కుపెట్టిన వారికి నేటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ ప్రగతి పథం’ పుస్తకం సరైన సమాధానాలను ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి దేశానికే మార్గదర్శిగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి శిఖరాలకు చేరుకున్న తీరు యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ, పరిశ్రమల శాఖ, వైద్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, ఐటీ శాఖ, ఆర్థిక శాఖ తదితర శాఖలలోని ప్రగతి వివరాలు పొందుపరిచిన “తెలంగాణ ప్రగతి పథం” కాఫీ టేబుల్ బుక్ ను సెక్రటేరియట్ లో మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, సహచర మంత్రులు, శాంతి కుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి తదితర అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ ప్రగతి పథం’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి, రూపొందించిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తెలుగు విభాగం కోఆర్డినేటర్ సువర్ణ వినాయక్, భాషా విభాగం సభ్యులు సంబరాజు రవి ప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి (ఓఎస్డీ) విద్యాసాగర్ తదితరులను ముఖ్యమంత్రి అభినందించి వారికి పుస్తక ప్రతులను అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here