ఆయన కట్టిన తాళి తప్ప ఏమీలేదు!

0
12

– అవకాశమివ్వండి మళ్లీ సినిమాల్లో నటిస్తా
– ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం
– ఇంటి కిరాయిలతోనే బతుకుతున్నాం
– ఇండస్ట్రీని వేడుకుంటున్న రియల్‌ స్టార్‌ శ్రీహరి భార్య
‘Disco Shanthi: ఆయన మెడలో కట్టిన తాళి ఒక్కటే మిగిలి ఉంది. మా దగ్గర ఉన్నా బంగ్లాలు, భూములన్నీ అమ్మి అప్పులు తీర్చేశా. ప్రస్తుతం మా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. రెండు ఇండ్ల ద్వారా వచ్చే కిరాయిలతోనే బతుకుతున్నాం. ఆయన ఉన్నప్పడు ఎందరికో సాయం చేశారు. చాలామందికి అప్పులు కూడా ఇచ్చారు. అవేవీ నాకు తెలియదు. ప్రస్తుతం నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. డబ్బుల్లేక వారు విదేశీ చదువులకు దూరమయ్యారు. వారిని చూసినప్పడల్లా బాధగా ఉంది’ అంటూ రియల్‌ స్టార్‌ దివంగత శ్రీహరి భార్య, నటి డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూ లో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే శ్రీహరి చనిపోయిన కొద్దిరోజులకే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మళ్లీ సినిమాల్లోకి వస్తానని ప్రకటించానని, కానీ ఇప్పటివరకు ఎవరూ తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. శ్రీహరి ఉన్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నామని, ఆయన పోయిన తర్వాత పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీహరి ఎందరినో ఆర్థికంగా ఆదుకున్నారని, వారెవ్వరూ ఇప్పడు తన ఫ్యామిలీని పట్టించుకోవడం లేదని, చేసిన సాయం తిరిగి ఇవ్వలేదన్నారు. ఇటీవల తన బిడ్డలకు చదువుకునేందుకు విదేశాల్లో అవకాశాలు వచ్చినా డబ్బుల్లేక వెళ్లలేకపోయారని భావోద్వేగం చెందారు. మళ్లీ చెబుతున్నా దర్శక, నిర్మాతలు తనకు అవకాశమిస్తే తిరిగి నటిస్తానని ఆ ఇంటర్వ్యూ వేదికగా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here