vemulawada: నాంపల్లిలో మహిళ మృతదేహం

0
1190

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాంపల్లి గ్రామ కమాన్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వేములవాడ రూరల్‌ మండలం ఎదురుగట్ల గ్రామానికి చెందిన కవితగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ వివరాల ప్రకారం.. మృతురాలు కవితకు మతిస్థిమితం సరిగ్గా లేదని, నాలుగు రోజుల క్రితమే ఇంటినుంచి వెళ్లియినట్లు కుటుంబికులు తెలిపారన్నారు.

ఫిట్స్‌ మూలంగానే ఆమె చనిపోయి ఉంటుందని వారు పేర్కొన్నట్లు చెప్పారు. ఇదిలాఉంటే కవిత ఫిట్స్‌ మూలంగానే మృతి చెందిందా, లేదా ఆత్మహత్య చేసుకుందా.. ఎవరైనా హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here