తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

0
16

– జర్నలిస్టులకు ఆరోగ్య పథకం ఏర్పాటు చేయాలి
– తెలంగాణ ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించిన జర్నలిస్టులు-
– జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి
– పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించిన జర్నలిస్టులు
– టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు : మజీద్
ప్రజానావ/ఎల్లారెడ్డిపేట : జర్నలిస్టులకు ఆరోగ్య పథకం ఏర్పాటు చేయాలని ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు మజీద్ ఆధ్వర్యంలో శుక్రవారం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించి ఉత్తరాలను పోస్ట్ చేశారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు మజీద్ మాట్లాడుతూ, రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు మండల కేంద్రంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. అలాంటి జర్నలిస్టులు నేడు స్వరాష్ట్రంలో ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో సత్వరమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టు ఆరోగ్య పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటీవ్ సభ్యులు కట్టెల బాబు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యులు దుంపేట గౌరీ శంకర్, ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు, ఐజేయూ సభ్యులు బండారి బాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కులేరి కిషోర్, ప్రధాన కార్యదర్శి షరీఫ్, కోశాధికారి రవి, జగదీశ్‌, నరేశ్‌, ప్రవీణ్, దేవరాజు, శ్యామంతుల అనిల్, మిర్యాలకర్ శ్రీనివాస్, చింతకింది శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, వాజిద్, మొయిస్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here